గత ఏడాది సెప్టెంబర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబో లో తెరకెక్కిన దేవర చిత్రానికి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినా.. ఎన్టీఆర్ స్టామినా తో దేవర చిత్రం పాన్ ఇండియా మార్కెట్ లో 500 కోట్లు కొల్లగొట్టింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ భుజాన మోసి దేవర ను హిట్ చేసారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా తంగం పాత్రలో జాన్వీ కపూర్ నటించింది.
జాన్వీ కపూర్ దేవర సాంగ్స్ లో ఎన్టీఆర్ కలిసి అదిరిపోయే స్టెప్స్ వెయ్యడమే కాదు, గ్లామర్ విషయంలో పిచ్చెక్కించేసింది. ఇప్పటికి దేవరలోని చుట్టమల్లే వచ్చేసానే సాంగ్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఈరోజు మార్చ్ 8 జాన్వీ కపూర్ బర్త్ డే. మరి జాన్వీ నటిస్తున్న సౌత్ చిత్రాల నుంచి ఆమెకి బర్త్ డే స్పెషల్ గా పోస్టర్స్ వస్తున్నాయి.
ఇప్పటికే RC 16 నుంచి జాన్వీ కపూర్ లుక్ వదలి ఆమెకి బర్త్ డే విషెస్ తెలిపారు మేకర్స్. ఇప్పుడు దేవర 2 లో జాన్వీ కపూర్ లుక్ వదులుతూ.. దేవర టీమ్ ఆమెకి బర్త్ డే విషెస్ ని తెలియజేసింది. తంగం గా జాన్వీ కపూర్ గ్లామర్ గా నోటిలో కత్తితో దర్శనమిచ్చింది. మరి దేవర 2 లో జాన్వీ కపూర్ రోల్ పూర్తిస్థాయిలో అభిమానులను ఇంప్రెస్స్ చెయ్యబోతుంది అని టీమ్ ఎప్పుడో చెప్పింది.