ఎన్టీఆర్ అల్లుళ్ళు చంద్రబాబు-దగ్గుబాటి వెంకటేశ్వరావు ల నడుమ పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది. తోడల్లుళ్లు ఇద్దరి మద్యన వైరం ఉంది అది అందరికి తెలిసిన విషయమే. చంద్రబాబు వలనే పురందరేశ్వరి టీడీపీ లో కొనసాగకుండా పక్క పార్టీల వంక చూస్తూ ఉంటారు. చంద్రబాబు-వెంకటేశ్వరావు లకు పడదు అనేది జగమెరిగిన సత్యం.
ప్రస్తుతం చంద్రబాబు-పురంధరేశ్వరి లు కూటమిలో కలిసి పని చేస్తున్నారు. కొన్నాళ్లుగా నారా-దగ్గుబాటి ఫ్యామిలీస్ నడుమ సఖ్యత కనిపిస్తుంది. రీసెంట్ గా 30 ఏళ్ళ తర్వాత తోడల్లుడు ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి దగ్గుబాటి వెంకటేశ్వరావు రావడం అందరిని ఆకర్షించింది. ఆయన రాసిన బుక్ లాంచ్ కి తోడల్లుడు చంద్రబాబు ఇంటికి వెళ్లి మరీ వెంకటేశ్వరావు ఆహ్వానించారు.
నిన్న రాత్రి వైజాగ్ లో జరిగిన బుక్ లాంచ్ కోసం చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్ లో వైజాగ్ వెళ్లారు. ఈ ఈవెంట్ విషయమై వెంకటేశ్వరావు మట్లాడుతూ.. చంద్రబాబు కు నాకూ వైరం ఉందని అంటుంటారు, మా మధ్యన వైరం ఉండేది నిజమే. కాలంతో పాటు మనము మారాలి. నేను చంద్రబాబు తో కలిసిపోయింది, టీడీపీ లో చేరిపోయి పదవులను ఆశించడానికి అనుకుంటున్నారేమో, నాకు మళ్ళీ రాజకీయ కోరికలు లేవులే,
మళ్ళీ అలాంటి కోరికలు ఉన్నాయని, అందుకే ఇలాంటి కలయికలు అనుకుంటారేమో అంటూ దగ్గుబాటి వెంకటేశ్వరావు చంద్రబాబు తో వైరం పై ఓపెన్ అయ్యారు.