కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లపై ఇష్టమొచ్చినట్లుగా కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడమే కాదు, వారు ముగ్గురిపై పిచ్చి సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మకు జైలు జీవితం తప్పదనుకున్నారు. అనుకున్నట్టే RGV పై ఏపీలో చాలా కేసులు నమోదయ్యాయి. ఇంకేంటి రామ్ గోపాల్ వర్మను ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తారు అనగానే RGV చకచకా కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు.
ఇప్పుడు తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా వలన కులాల మధ్య విద్వేషాలు కలిగిస్తున్నాయని ఫిర్యాదు పై వర్మపై సీఐడీ కేసు నమోదు చేసింది. దానితో RGV హడావిడిగా హై కోర్టుకి వెళ్లి తనపై ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోకుండా సీఐడీ నమోదు చేసిన కేసుపై స్టే తెచ్చుకున్నాడు.
సీఐడీ కేసుపై తదుపరి చర్యలపై స్టే ఇవ్వాలని హై కోర్టులో వర్మ పిటిషన్ వేసాడు. RGV పిటిషన్ పై విచారణ జరిపి తదుపరి చర్యలపై 6 వారాలు స్టే ఇచ్చిన న్యాయస్థానం, తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వెయ్యడంతో రామ్ గోపాల్ వర్మకు ఊరట లభించినట్లయింది.