బాలీవుడ్ లో గత నెలలో విడుదలైన విక్కీ కౌశల్-రష్మిక మందన్న ల ఛావా చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వందల కోట్లు కొల్లగొడుతూ కొత్త రికార్డులను షురూ చేసిన ఛావా చిత్రాన్ని పాన్ ఇండియా మర్కెట్ లో వదులుతున్నారు. రేపు శుక్రవారం తెలుగులో ఛావా విడుదలకు సిద్దమవుతుంది.
ఇలాంటి సమయంలో ఏపీలో ఛావా సినిమాపై వివాదం నెలకొనడం హాట్ టాపిక్ అయ్యింది. ఏపీ లో చావా సినిమా పై వివాదం, సినిమా ను వక్రీకరించి తీసారని, ఏపీ లో సినిమా రిలీజ్ చేయకుండా చూడాలని ముస్లిం ఫెడరేషన్ అఫ్, ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ మహ్మద్ జియా ఉల్ హాక్ డిమాండ్ చెయ్యడమే కాదు నెల్లూరు జిల్లా కలెక్టర్ కు విజ్ఞాన పత్రం అందజేసింది.
ఈ నెల 7 న రెండు తెలుగు రాష్ట్రల్లో విడుదల కాబోతున్న చావా సినిమా. దేశ వ్యాప్తంగా సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఛావా ఇప్పుడు ఏపీ రిలీజ్ పై సస్పెన్స్ మొదలైంది.