గ్లామర్ డాల్ రాశి ఖన్నా సోషల్ మీడియా అందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాల్లోనే కాదు రాశి ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసే లుక్స్ కూడా గ్లామర్ గానే ఉంటాయి. ఎప్పుడు మోడ్రెన్ పాత్రలకు దగ్గరగా ఉంటుంది. సౌత్ సినిమాల్లోనే రాశి ఖన్నా గ్లామర్ పెరఫార్మెన్స్ చూసేసారు.
హిందీలోకి ఎంటర్ అయ్యాకా రాశి ఖన్నా ఆ గ్లామర్ డోస్ ని మరింత పెంచేసింది. చిట్టిపొట్టి డ్రెస్సులతోనే కాదు చీర కట్టులోనూ రాశి ఖన్నా అందాలు ఆరబొయ్యడంలో ప్రత్యేకతను చూపిస్తుంది. తాజాగా బ్లాక్ శారీ లో రాశి ఖన్నా లేటెస్ట్ లుక్ మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది.
బ్లాక్ శారీ, బ్లాక్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో హెయిర్ జడ వేసి చక్కటి బ్యూటీఫుల్ ఫోజులతో రాశి ఖన్నా అద్దరగొట్టేసింది. ప్రస్తుతం హిందీ ప్రజెక్ట్స్ తో కాస్త బిజీగా వున్న రాశి ఖన్నా తెలుగులో నితిన్ తో తమ్ముడు మూవీలో నటిస్తుంది.