హీరోయిన్ సమంత ప్రస్తుతం సౌత్ సినిమాలను పక్కనపెట్టి ముంబైలో సెటిల్ అవ్వబోతుంది అనేలా ఉంది ప్రస్తుత పరిస్థితి. అక్కడే ఆమెకు అవకాశాలు వస్తున్నాయి, వాటికి సైన్ చేస్తూ ముంబైలోనే ఉంటున్న సమంత ని సౌత్ ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు. అయితే సమంత నటిగానే కాదు నిర్మాతగానూ మరింది.
మరోపక్క సమంత సాకి పేరుతొ బ్రాండెడ్ దుస్తుల వ్యాపారం చేస్తుంది. అప్పుడప్పుడు ఆమె తన సాకి ప్రొడక్ట్స్ ని సెలబ్రిటీస్ కి పంపుతూ ఉంటుంది. తాజాగా సమంత రశ్మికకు సాకి నుంచి కొన్ని దుస్తులను నేషనల్ క్రష్ రష్మిక కోసం పంపించింది. ఆ విషయాన్ని రష్మిక సోషల్ మీడియా వేదికగా రివీల్ చేసింది.
తనకు బ్రాండెడ్ దుస్తులు పంపిన సమంతకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. మరి సమంత రశ్మికకు గిఫ్ట్ ఇవ్వడం ఏమో కానీ.. ఇలా సమంత వ్యాపారం బాగా పబ్లిసిటీ అవుతుంది. రష్మిక సమంత కు థాంక్స్ చెప్పడం ఆమె బిజినెస్ కి మరింత హెల్ప్ అవుతుంది కదా.!