పాపం జగన్ ఓడిపోయి తొమ్మిది నెలలవుతున్నా బిర్యానీ-పలావ్ అంటూ కబుర్లు చెబుతున్నాడు తప్ప పార్టీ ఓటమికి కారణాలేమిటో, పార్టీకి మరోసారి పూర్వ వైభవం ఎలా తీసుకురావాలో అని ఆలోచించడమే లేదు. అసెంబ్లీ కి వెళ్లకుండా బయట ప్రెస్ మీట్స్ పెట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై పంచ్ లు వేస్తున్నాడు తప్ప వైసీపీ పార్టీని బలోపేతం చేసే ఆలోచన జగన్ లో కనిపించడం లేదు.
ఇది మేమన్నది కాదు, సాక్షత్తు జగన్ పెంచి పోషించిన బ్లూ మీడియానే. జగన్ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా తాను పలావుపెడతానంటే.. చంద్రబాబు బిర్యానీకి ఆశపడి వైసీపీ పార్టీని ఓడించారు, అక్కడ చూస్తే నేను ఇచ్చే పలావ్ లేదు, చంద్రబాబు హామీ ఇచ్చిన బిర్యానీ రెండు ప్రజలకు చేరనే లేదు అంటూ పాడిన పాటే పాడుతున్నాడు.
జగన్‌కు బోరు కొట్టని బిర్యాని- పలావ్ స్టోరీ అంటూ బ్లూ మీడియా సోషల్ మీడియాలో జగన్ ను ఏసుకుంటుంది. 9 నెలల్లో ఏ ప్రెస్ మీట్ పెట్టినా నేను పలావ్ పెట్టా.. చంద్రబాబు బిర్యాని పెడతాడు అనుకున్నారు ప్రజలు అంటూ కామెంట్స్ చెయ్యడమే కాదు, ప్రజలకు తను పెట్టిన పలావ్ సరిపోలేదనే కారణంగా ఘోరాతిఘోరంగా ఓడించిన విషయం మాత్రం తెలుసుకోలేకపోతున్న జగన్ అంటూ బ్లూ మీడియా జగన్ పై సెటేరికల్ కామెంట్స్ వేస్తుంది.