సందీప్ రెడ్డి వంగ-ప్రభాస్ కాంబోలో ఉగాది కి మొదలు కాబోతున్న స్పిరిట్ చిత్రంపై పాన్ ఇండియాలో భీభత్సమైన అంచనాలున్నాయి. ప్రభాస్ ఎప్పుడెప్పుడు స్పిరిట్ సెట్స్ లోకి అడుగుపెడతారా అని ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. స్పిరిట్ లో ప్రభాస్ పోలీస్ ఆఫీస్ గా కనిపించబోతున్నట్లుగా సందీప్ వంగ ఎప్పుడో రివీల్ చేసేసారు.
తాజాగా స్పిరిట్ యాక్షన్ సీక్వెన్స్ కి సంబందించిన లీక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్పిరిట్ లో ప్రభాస్ షర్ట్ విప్పి సిక్స్ ప్యాక్ తో భారీ ఫైట్ సీన్ లో కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ మాస్ కటౌట్ కి ఫ్యాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా లోని మాస్ ఆడియన్స్ కూడా ఫిదా అవడం గ్యారెంటీ అంటున్నారు.
అంతేకాకుండా పూరి జగన్నాధ్ స్పిరిట్ చిత్రానికి మాస్ డైలాగ్స్ అందించబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రభాస్ కెరీర్ లోనే మొదటిసారి పోలీసు ఆఫీసర్ గా దర్శనమివ్వబోతుడటంతో స్పిరిట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కె కాదు మాస్ ఆడియన్స్ లోను విపరీతమైన క్యూరియాసిటీ ఉంది.