విశ్వక్ సేన్ లేటెస్ట్ లేడీ గెటప్ చిత్రం లైలా. ఈ చిత్రం విడుదలకు ముందు పబ్లిసిటీ పరంగా అందరి దృష్టిని ఆకర్షించడమేకాదు, లైలా సినిమా పొలిటికల్ కాంట్రవర్సీ లో చిక్కుకోవడం ఆ సినిమా ఓపెనింగ్స్ కి హెల్ప్ అవుతుంది అనుకున్నారు. కానీ థియేటర్స్ లో ప్రేమికుల రోజు సందర్భంగా అంటే ఫిబ్రవరి 14 న విడుదలైన లైలా రిజల్ట్ తేడా కొట్టింది.
లైలా గా విశ్వక్ సేన్ లేడీ గెటప్ కి వచ్చిన ప్రశంశలు సినిమా కంటెంట్ విషయంలో రాకపోవడంతో విశ్వక్ సేన్ కెరీర్ లోనే లైలా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇప్పుడు ఈసినిమా ఓటీటీ ఎంట్రీకి కి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా లైలా చిత్ర డిజిటల్ హక్కులని ఫ్యాన్సీ డీల్ తో కొనేసింది.
తాజాగా లైలా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని ఆహా వారు అనౌన్స్ చేసారు. మార్చి 7 నుంచి లైలా ఆహాలో స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమైంది. మరి థియేటర్స్ లో విడుదలైన మూడు వారాల్లోపే లైలా ఓటీటీలోకి వచ్చేస్తుంది.