రాజమౌళి-మహేష్ కాంబోలో సైలెంట్ గా మొదలైన SSMB 29 షూటింగ్ బ్రేకులు లేకుండా చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి-మహేష్ లు హైదరాబాద్ షెడ్యూల్ ముగించుకుని ఒడిశాకు ప్రయాణమవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి ఏ చిన్న విషయమైనా ఇట్టే వైరల్ అవుతుంది.
ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తున్నారనే టాక్ ఉంది. ఈ విషయమై పృథ్వీ రాజ్ గతంలోనూ నర్మగర్భంగా మాట్లాడారు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ SSMB 29 లో నటించబోతున్నట్టుగా ఆయన ఇండైరెక్ట్ గా చెప్పేశారంటూ అందరూ ఫిక్స్ అవుతున్నారు.
పృథ్వీ రాజ్ సుకుమారన్ సోషల్ మీడియా వేదికగా.. ప్రస్తుతం దర్శకుడిగా నా చేతిలో ఉన్న సినిమాలన్ని పూర్తి చేశాను. వాటికి సంబంధించి మార్కెటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి.నటుడిగా తెరపై కనిపించడానికి రెడీ అవుతున్నాను. పరభాషా చిత్రంలో నటించబోతున్నాను.
అందులో పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్నాయని కాస్త భయపడుతున్నాను అంటూ పృథ్వీ రాజ్ చేసిన ట్వీట్ SSMB 29 కి సంబంధించి ఇండైరెక్ట్ గా చెప్పారంటూ అందరూ బలంగా ఫిక్స్ అవుతున్నారు.