యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో మైత్రి మూవీస్ వారు ఎనౌన్స్ చేసిన NTR 31 ప్రాజెక్ట్ గత ఏడాది ఆగష్టు లో పూజా కార్యక్రమాలతో మొదలైనా ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో ఫైనల్ గా సెట్స్ పైకి వెళ్ళింది. ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ కి ముందు నుంచి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
డ్రాగన్ అంటే పవర్ ఫుల్ టైటిల్ అని ఎన్టీఆర్ ఫాన్స్ కూడా ఉత్సాహ పడ్డారు. ఈలోపు తమిళ హీరో ప్రదీప్ రంగనాధన్ రిటన్ ఆఫ్ ద డ్రాగన్ టైటిల్ తో వచ్చి పడ్డాడు. దానితో ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ టైటిల్ పై మరోసారి రకరకాల ఊహాగానాలు మొదలయ్య్యాయి.
తాజాగా మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ టైటిల్ ని రివీల్ చేసేసారు. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ సక్సెస్ మీట్ లో నిర్మాత రవి శంకర్ మట్లాడుతూ.. ఎన్టీఆర్ తో చేసే డ్రాగన్ చిత్రం హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ. ఆ డ్రాగన్ కి ఈ డ్రాగన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎన్టీఆర్ డ్రాగన్ ఇంటెర్నేషనల్ మూవీ.
ఈ డ్రాగన్ హిట్ అవడం హ్యాపీ గా ఉంది. నెక్స్ట్ మా పెద్ద డ్రాగన్ వచ్చి మొత్తం చుట్టేస్తోంది అంటూ ఫ్లోలో ఎన్టీఆర్-నీల్ కాంబో టైటిల్ ని అలా రివీల్ చేసేసారు.