గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో, సత్యమూర్తి అనే ఉద్యోగి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి విజయవాడ జైలులో ఉన్న వల్లభనేని వంశీ బెయిల్ కోసం నానా తిప్పలు పడుతున్నాడు. హెల్త్ ఇష్యుస్ ఉన్నాయి బెయిల్ కావాలంటూ వంశీ తరుపు లాయర్ ఎంతగా వాధించినా కోర్టు కనికరించడం లేదు.
తాజాగా YSRCP నేత వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో CID అధికారులు కోర్టులో ఇవాళ పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో విజయవాడ సీఐడీ కోర్టు ఆయన్ను వర్చువల్గా విచారించి 14 రోజుల రిమాండ్ విధించింది.