ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆస్కార్ అవార్డ్ విశిష్టత తెలుగు వారికి కూడా తెలిసొచ్చింది. అప్పటి నుంచి ఎప్పుడు అకాడమీ అవార్డులు ప్రకటించినా, అందులో తెలుగు సినిమా లేదంటే.. ఇండియన్ సినిమాలు ఏవైనా ఉంటాయా అని అంతా దృష్టి పెడుతూ వస్తున్నారు. ప్రస్తుతం 97వ అకాడమీ అవార్డుల వేడుక లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో గ్రాండ్‌గా మొదలై, ఒక్కొక్కరిగా విన్నర్ అనౌన్స్‌మెంట్ వస్తోంది.
అయితే, ఈసారి భారత్ తరపున బరిలో ఉన్న ఏకైక చిత్రం, సారీ లఘు చిత్రం అనూజ. లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో స్థానం సంపాదించుకున్న ఈ లఘు చిత్రానికి నిరాశే ఎదురైంది. అనూజ ఉన్న కేటగిరిలో అవార్డ్ ఐయామ్ నాట్ ఏ రోటో అనే లఘు చిత్రాన్ని వరించింది. దీంతో భారతీయులకు నిరాశే ఎదురైంది.
ఇప్పటి వరకు అనౌన్స్ అయిన ఆస్కార్ విజేతల లిస్ట్:
ఉత్తమ స్క్రీన్‌ప్లే- అనోరా (సీన్ బేకర్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే- కాన్‌క్లేవ్ (పీటర్ స్ట్రాగన్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్- వికెడ్ (పాల్ తేజ్‌వెల్)
ఉత్తమ సహాయ నటుడు- కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్)
ఉత్తమ సహా నటి- జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్- ఐయామ్ నాట్ ఏ రోబో
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్- ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్- నో అదర్ ల్యాండ్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్- ఫ్లో
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్- ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్
ఉత్తమ ఎడిటింగ్- అనోరా (సీన్ బేకర్)
ఉత్తమ సౌండ్- డ్యూన్: పార్ట్2
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్- డ్యూన్:పార్ట్2
ఉత్తమ ఒరిజినల్ సాంగ్- ఎల్ మాల్ (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్- వికెడ్
ఉత్తమ మేకప్, హెయిల్‌స్టైల్- ది సబ్‌స్టాన్స్