Advertisement
Google Ads BL

మీనూ పాప ఏపీ బ్రాండ్ కాదు


ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎం పవర్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌‌గా టాలీవుడ్ హీరోయిన్, సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ మీనూ పాప మీనాక్షి చౌదరిని ఏపీ ప్రభుత్వం నియమించిందనేలా ఆదివారం ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రచారంలో నిజం లేదని, అసలు అలాంటిదేమీ జరగలేదని, ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ వింగ్ క్లారిటీ ఇచ్చింది.

Advertisement
CJ Advs

సోషల్ మీడియాలో మీనాక్షి చౌదరి బ్రాండ్ అంబాసిడర్ అంటూ వైరల్ అవుతున్న ప్రచారం పూర్తిగా ఫేక్ అని, ప్రభుత్వం పేరుతో ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై, ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ వింగ్ సోషల్ మీడియా అకౌంట్స్‌ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో, మీనూ పాప అంబాసిడర్ అంటూ ప్రచారం చేసిన వారంతా, సోషల్ మీడియాలో వారి పోస్ట్‌లను తొలగిస్తున్నారు.

ఇక, మీనాక్షి బ్రాండ్ అంబాసిడర్ అనే వార్తలు ఎప్పుడైతే వచ్చాయో.. అంతా ఆమెకు శుభాకాంక్షలు చెప్పడం మొదలెట్టారు. కానీ, మీనాక్షి మాత్రం స్పందించలేదు. నేను కాదు అని ఎక్కడా చెప్పలేదు. బహుశా, ఈ ఫేక్ వార్తలని ఆమె కూడా ఎంజాయ్ చేసి ఉంటుందేమో. ప్రస్తుతం వరుస సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా మీనాక్షి దూసుకెళుతోంది.

Meenaakshi Chaudhary Not AP Brand Ambassador, Clarifies Fact Check:

Fake News Alert: Meenaakshi Chaudhary Not AP Women Empowerment Brand Ambassador
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs