మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం అంటూ సోషల్ మీడియాలోనూ, కొన్ని వెబ్‌సైట్లలో వస్తున్న వార్తలపై చిరు టీమ్ వివరణ ఇచ్చింది. ఇంతకీ ఆ అరుదైన గౌరవం ఏమిటంటే, చిరంజీవి యుకె సిటిషన్ షిప్‌ని తీసుకుంటున్నారట. యుకె గవర్నమెంట్ ఇచ్చిన ఈ గౌరవాన్ని చిరు స్వీకరించబోతున్నట్లుగా వార్తలు వైరల్ అవుతుండటంతో చిరు టీమ్ అలెర్ట్ అయింది.
అసలే ఈ మధ్య చిరంజీవిపై సోషల్ మీడియాలో ఎలా పడితే అలా నెగిటివ్ వార్తలు, పోస్ట్‌లు చేస్తూ వైరల్ చేసే టీమ్ ఎక్కువైంది. ఆయన సరదాగా అన్నమాటని కూడా పట్టించుకుని, అదేదో పెద్ద, ఘోరమైన తప్పిదంగా చూపించేందుకు ఓ పార్టీ వర్గాలు, యాంటీ ఫ్యాన్స్ పనిగట్టుకుని మరీ కూర్చుంటున్నారు. అలాంటి వారు వైరల్ చేసే వార్తలు ఎక్కడ నిజమని అంతా అనుకుంటారో అని, వెంటనే చిరంజీవి టీమ్ వివరణ ఇస్తూ, అవన్నీ రూమర్స్‌గా కొట్టిపారేశారు.
చిరంజీవిని సన్మానించేందుకు యుకెలో ఓ కార్యక్రమం జరగాల్సి ఉందట. దానిని దృష్టిలో పెట్టుకుని అంతా లేనిపోని వార్తలను వైరల్ చేస్తున్నారు. ఈ వార్తలతో ఆ వేడుకకు కూడా చిరు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి దుబాయ్ టూర్ ముగించుకుని, విశ్వంభర సాంగ్స్ షూట్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు.