Advertisement
Google Ads BL

దిల్ రూబా బైక్ మీ సొంతం కావాలంటే


యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. సినిమాలో ఆయన వాడిన దిల్ రూబా బైక్‌ని గెలుచుకునేలా ఓ కాంటెస్ట్ అనౌన్స్ చేశాడు. దీనికి ఏం చేయాలో కూడా ఆయనే చెప్పాడు. బైక్ చూస్తే యమా టెంప్టింగ్‌గా ఉంది. ఈ బైక్‌ని సినిమా ఆర్ట్ డైరెక్టర్ ప్రత్యేకంగా తయారు చేశాడంట. మార్కెట్‌లో ఎక్కడా ఈ బైక్ లభించదు అనే విషయాన్ని కూడా కిరణే ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇంతకీ బైక్ సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలంటే..

Advertisement
CJ Advs

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, సాంగ్స్ వంటి కంటెంట్‌లోనే ఈ మూవీ స్టోరీలైన్ దాగి ఉందట. అదేంటో ఊహించి, అద్భుతంగా చెప్పిన వారికి, తను ఎంతగానో లవ్ చేసే దిల్ రూబా బైక్‌ని గిఫ్ట్‌గా ఇస్తామని చెబుతున్నాడు. అంతేకాదు, దిల్ రూబా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజేతకు బైక్ ఇవ్వడంతో పాటు, దిల్ రూబా ఫస్ట్ డే ఫస్ట్ షో‌ను చూసేందుకు అదే బైక్ మీద వెళ్తానని చెప్పాడు. మరెందుకు ఆలస్యం, దిల్ రూబా ప్రమోషనల్ కంటెంట్ మొత్తం తిరగేయండి, ఆన్సర్ చెప్పేయండి, అద్భుతమైన బైక్ పట్టేయండి. 

క వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న చిత్రం దిల్ రూబా. శివమ్ సెల్యులాయిడ్స్, సారెగమకు చెందిన ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విశ్వ కరుణ్ దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మిస్తున్నారు. మార్చి 14న హోలీ పండుగ స్పెషల్‌గా ఈ సినిమా విడుదల కానుంది.  

Kiran Abbavaram Announces Contest to Win the Exclusive Dil Ruba Bike:

Win the Dil Ruba Bike with Kiran Abbavaram Exciting Contest for Fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs