Advertisement
Google Ads BL

నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా


కూటమి ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చెయ్యడమే కాదు, గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు చేసిన మాజీ మినిస్టర్స్, మాజీ ఎమ్యెల్యేలకు ఒక్కొక్కరికి టైమ్ దగ్గరపడింది. గత ప్రభుత్వంలో జగన్ మెప్పు పొందేందుకు ఇష్టమొచ్చినట్లుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై కామెంట్స్ చేసిన ఏ ఒక్కరిని కూటమి ప్రభుత్వం అంత ఈజీగా వదిలేలా లేదు. 

Advertisement
CJ Advs

ఇప్పటికే అలాంటి వారిపై కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. రీసెంట్‌గా వల్లభనేని వంశీని టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో, సత్యమూర్తిని కిడ్నాప్ చేసిన కేసులో జైలుకి పంపించారు. బాబు, లోకేష్, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో పోసాని జైలుకెళ్లాడు. ఆ తర్వాత గోరంట్ల మాధవ్ పై కేసు నమోదు అయ్యింది. ఇంత జరుగుతున్నా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు మాత్రం శాంతించడం లేదు. 

కారణం కొడాలి నాని, పేర్ని నాని, రోజా లాంటి వాళ్ళు ఇంకా బయట తిరుగుతున్నారు, అందరికన్నా ముందుగా కొడాలి నాని జైలుకెళ్లాలని వారు ఆశపడ్డారు. కొడాలి నాని అంతలా టీడీపీ కార్యకర్తలను టార్గెట్ చేశాడు. సమయం సందర్భం లేకుండా చంద్రబాబు, పవన్, లోకేష్ లని ఇష్టమొచ్చినట్టుగా కారు కూతలు కూయడం టీడీపీ అభిమానులకు నచ్చలేదు. 

అందుకే నాని జైలుకెళ్ళే సమయం కోసం వారు వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాత పేర్ని నాని దొంగ బియ్యం కేసులో ఎప్పుడెప్పుడు జైలుకెళ్తాడా అని వెయిటింగ్. జగన్ అన్న మెప్పు కోసం చంద్రబాబు, లోకేష్, పవన్ లపై నీచాతినీచంగా నోరు పారేసుకున్న రోజాను ఎప్పుడెప్పుడు జైలుకు పంపుతారా అని ఆతృతగా ఉన్నారు టీడీపీ కార్యకర్తలు. మరి పోసాని, గోరంట్ల మాధవ్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరో జస్ట్ వెయిట్ అండ్ సి.

Who is Next in Nara Lokesh Red Book:

Coalition Government Takes Action Against Former Ministers and YSRCP Leaders  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs