బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ కియారా అద్వానీ తల్లి కాబోతోందా? సిద్దార్థ్ మల్హోత్రా - కియారా పేరెంట్స్‌గా ప్రమోట్ కాబోతున్నారా? అంటే వారు పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ చూస్తే అది నిజమే అని తెలుస్తుంది. వాళ్ళు ఇండైరెక్ట్‌గా మా లైఫ్‌కి సంబంధించి అద్భుతమైన బహుమతి త్వరలో రానుంది.. అంటూ చేతిలో బేబీ సాక్స్‌నీ, బేబీ ఎమోజీనీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి అభిమానులతో గుడ్ న్యూస్ పంచుకున్నారు.
2023లో ప్రేమ వివాహం చేసుకున్న కియారా అద్వానీ - సిద్దార్థ్ మల్హోత్రా.. ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా గేమ్ ఛేంజర్‌లో నటించిన కియారా అద్వానీ.. హృతిక్ - ఎన్టీఆర్‌ల వార్ 2లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక పెళ్లయిన రెండేళ్లకే కియారా జంట తల్లితండ్రులుగా మారబోతున్నారు.
ఈ విషయం తెలిసిన స్నేహితులు, ప్రముఖులు సిద్దార్థ్ - కియరా జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు త్వరత్వరగా పూర్తి చేసి, తన మాతృత్వాన్ని ఎంజాయ్ చేయాలనే ఆలోచనలో కియారా ఉన్నట్లుగా తెలుస్తోంది.