మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ చెయ్యడం ఆ చిత్రంపై క్రేజ్ పెరగడానికి కారణమైంది. ఎంతో బిజీగా వున్న సమయంలో ప్రభాస్ కన్నప్ప కోసం టైమ్ స్పెండ్ చెయ్యడం మాత్రం చాలా సర్ ప్రైజ్ గా ఉంది. ప్రభాస్ కన్నప్ప కోసం అడిగినప్పుడు ఎలాంటి ఆలోచన చెయ్యకుండా మరుక్షణమే ఓకె చెప్పారు.
ప్రభాస్ ను కన్నప్పలో క్యామియో చెయ్యమని నాన్నగారు ఫోన్ చేసారు. దానికి వెంటనే ప్రభాస్ ఒప్పేసుకున్నారు. ఆతర్వాత ప్రభాస్ నాతో మోహన్ బాబు గారు ఫోన్ చెయ్యగానే భయపడ్డాను అని, ఏదైనా అవసరం ఉంటే నువ్వే ఫోన్ చెయ్యి అని ప్రభాస్ చెప్పారని మంచు విష్ణు ప్రభాస్ కన్నప్పలో ఎలా భాగమయ్యారో అనే సీక్రెట్ రివీల్ చేసారు.
ఇక కన్నప్ప లో రుద్రా కేరెక్టర్ చేస్తున్నందుకు గాను ప్రభాస్ ఎలాంటి పారితోషికం తీసుకోలేదని, మోహన్ బాబు పై ఉన్న ప్రత్యేకమయిన గౌరవంతోనే ప్రభాస్ కన్నప్ప లో ఫ్రీగా నటించారనే టాక్ ఉంది.