స్టార్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, తమన్నా పోలీస్ విచారణకు హజరు కాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి హీరోయిన్స్ తమన్నా, కాజల్ ను పోలీసులు విచారించనున్నారని తెలుస్తుంది.
సెలెబ్రిటీ హోదాలో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని పబ్లిసిటీ చేస్తూ ప్రజలను తమన్నా, కాజల్ లాంటి స్టార్స్ మోసం చేస్తున్నారని పుదుచ్చేరి పోలీసులకు అందిన ఫిర్యాదుతో వారిరువురికి పోలీసులు విచారించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. క్రిప్టో కరెన్సీ లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని ఆశ చూపి 10 మంది నుంచి సుమారు 2.40కోట్లు వసూలు చేశారని అశోకన్ అనే రిటైడ్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
క్రిప్టో కరెన్సీ కంపెనీ 2022లో కోయంబత్తూరు మెయిన్ బ్రాంచ్ ఓపెనింగ్ లో తమన్నా, మహాబలిపురంలోని క్రిప్టో కరెన్సీ కంపెనీ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ హాజరై పూబ్లిసిటీ చెయ్యడంతో ప్రజలు అందులో అధిక మొత్తంలో సొమ్ము జమచేసి మోసపోయారంటూ అశోకన్ తన పిటిషన్ లో పేర్కొనడంతో ఇప్పుడు కాజల్, తమన్నా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తోంది అంటున్నారు.