తన తల్లి బసవతారకం పుట్టిన ఊరు కొమరవల్లి గ్రామస్తులపై ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. నిమ్మకూరు లో బాలయ్యతో ఫోటోలు దిగిన కొమరవల్లి గ్రామస్తులు తమ ఊరును ఎప్పుడు బాగుచేస్తారు, మా గ్రామాన్ని పట్టించుకోరా అని బాలయ్యను నిలదీశారు.
దానితో ఆగ్రహం వ్యక్తం చేసిన బాలయ్య మీ గ్రామాన్ని పట్టించుకోను, నాతొ ఫోటోలు దిగరుగా ఇక వెళ్ళండి అంటూ కోపంతో వారిపై ఫైర్ అవడమే కాదు, కొమరవల్లి గ్రామమా అదెక్కడ ఉంది అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన బాలయ్య లింగాయత్ లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.
అయితే తల్లి బసవతారకం పేరు మీద క్యాన్సర్ ఆసుపత్రిని రన్ చేస్తూ సేవలందిస్తున్న నందమూరి బాలాకిష్ణ తన తల్లి స్వగ్రామమైన కొమరవల్లి పై అంత కోపమేమిటో, అందుకు గల కారణమేమిటో, కారణం లేకుండా బాలయ్య అలా బిహేవ్ చెయ్యరు అనే మాట నెటిజెన్స్ నుంచి, బాలయ్య అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది.