ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి పై తాజాగా వినిపిస్తోన్న అలిగేషన్ చూస్తే అందరూ ఖచ్చితంగా షాకవ్వాల్సిందే. రాజమౌళి స్నేహితుడు రాజమౌళి పై చేసిన షాకింగ్ వీడియో చూసి జక్కన్న అభిమానులు సైతం షాకవుతున్నారు.
ఎస్.ఎస్. రాజమౌళి పై ఆయన స్నేహితుడు యు.శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేసారు. రాజమౌళి టార్చర్ భరించలేని తాను ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో, లెటర్ వ్రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళితో తనకు దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందని చెబుతున్న శ్రీనివాసరావు రాజమౌళి-ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కిన యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.
రాజమౌళి టార్చ భరించలేకపోతున్నాను నాకు ఆత్మహత్యే శరణ్యం అంటూ సెల్ఫీ వీడియో, లెటర్ ను రాజమౌళి సన్నిహితులకు పంపిన శ్రీనివాసరావు.. వీడియో, లెటర్ ఆధారంగా రాజమౌళిపై సుమోటో కేసు నమోదు చేయాలని పోలీసులకు శ్రీనివాసరావు విజ్ఞప్తి. అంతేకాకుండా రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చెయ్యడం ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది.