వైసీపీ ప్రభుత్వంలో అధికార మదంతో రెచ్చిపోయిన వారంతా కూటమి ప్రభుత్వ హయాంలో జైలు దారి పడుతున్నారు. వైసీపీ నేతలు వరసగా జైలు పాలవుతున్నారు. పిన్నెల్లి మొదలు గత రాత్రి అరెస్ట్ అయిన పోసాని కృష్ణ మురళి వరకు అందరూ వైసీపీ ప్రభుత్వ అండతో రెచ్చిపోయిన నేతలే.
ఇక వైసీపీ నేతలు అరెస్ట్ అయిన ప్రతిసారి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వాళ్ళను పరామర్శించేందుకు మంది మార్బలంతో జైలుకు వచ్చి వారిని పరామర్శించి వెళ్లడమనేది పరిపాటిగా మారింది. నిన్నగాక మొన్న వల్లభనేని వంశీ జైల్లో ఉంటే పరామర్శించి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి మరో పరామర్శకు రెడీ అవుతారా..
తన కోసం పని చేసి గత రాత్రి అరెస్ట్ అయిన పోసాని కృష్ణమురళి కోసం జగన్ కదులుతారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. జగన్ అండ చూసుకుని బాబు, లోకేష్, పవన్ లపై నోరు పారేసుకున్న పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అయ్యి జైలుకెళ్లారు. మరి తన కోసం ప్రాణం పెట్టిన పోసానికి జగన్ అండ ఉంటుందా అంటే ఉంటుంది అనేలా పోసాని అరెస్ట్ తర్వాత ఆయన భార్యను జగన్ మోహన్ రెడ్డి ఫోన్ లో పరామర్శించారు.
మరి వంశీ కోసం జైలుకి వెళ్లి పరామర్శించిన జగన్ ఇప్పుడు పోసాని కోసం జైలుకు వస్తారో, రారో అనేది జస్ట్ వెయిట్ అండ్ సి.