బ్లాక్ బస్టర్ అఖండ కి సీక్వెల్ గా బోయపాటి-నందమూరి బాలకృష్ణ కలయికలో తెరకెక్కుతున్న అఖండ తాండవం చిత్రం షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. గత నెలలో మహా కుంభమేళాలో కీలక సన్నివేశాలను ని తెరకెక్కించిన బోయపాటి తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో అఖండ 2 చిత్రీకరణ కోసం లొకేషన్స్ వెతికారు.
అయితే అఖండ లో బాలయ్య శివుణ్ణి ఆరాధిస్తూ సన్యాసిగా కనిపిస్తారు. మరి అఖండ 2 లో బాలకృష్ణ అదేమాదిరి కనిపిస్తారు. శివారాధకుడిగా కనిపించబోయే బాలయ్య కు సంబందించిన లుక్ ను మహాశివరాత్రి స్పెషల్ గా మేకర్స్ వదులుతారని నందమూరి అభిమానులు వెయిట్ చేసారు.
కానీ నిన్న మహాశివరాత్రి సందర్భంగా అఖండ తాండవం నుంచి ఎలాంటి ట్రీట్ కానీ అప్ డేట్ కానీ మేకర్స్ ఇవ్వలేదు. ఈ విషయంలో నందమూరి అభిమానులు చాలా డిజప్పాయింట్ అవుతున్నారు. మరి బోయపాటి ఈ చిత్రాన్ని దసరా స్పెషల్ గా విడుదల చెయ్యాలని ఫిక్స్ అయ్యారు.