వల్లభనేని వంశీ గత గురువారం హైదరాబాద్ లో గచ్చిబౌలి మై హోమ్ భుజ లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. టీడీపీ ఆఫీస్ ఉద్యోగి సత్యమూర్తిని కిడ్నాప్ చేసిన కేసులో, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ ని పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్న వంశీపై మరిన్ని కేసులు నమోదు అవుతున్నాయి.
రెండు రోజుల క్రితమే వంశీ పై భూకబ్జా కేసు నమోదు అయ్యింది. గన్నవరంలో ఓ స్థలాన్ని వంశీ అనుచరులు కబ్జా చేసారని వంశీ పై ఓ మహిళా కేసు పెట్టింది. తాజాగా వల్లభనేని వంశీ పై మరో కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది.
గన్నవరం శివారులోని 18 ఎకరాల్లో ఉన్న పానకాల చెరువు భూమి పై గతంలో రైతులను ఒత్తిడి చేసి, భూమి స్వాధీనం చేసుకున్నాడు అంటూ మర్లపాలెం గ్రామానికి చెందిన జాస్తి మురళి కృష్ణ కేసు పెట్టారు. చెరువు అభివృద్ధి పేరుతో నిబంధనలను ఉల్లంఘించి మట్టి తవ్వకాలు చేసి అమ్ముకున్నారు అని ఫిర్యాదు చేయడంతో పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు.