వైసీపీ ప్రభుత్వ అండతో కన్ను మిన్ను కానకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై ఇష్టం వచ్చినట్లుగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొద్దిగా గ్యాప్ ఇచ్చి వైసీపీ సోషల్ మీడియా పై పడింది. సోషల్ మీడియా లో కూటమి ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అందరికి జైలు తప్పదని హెచ్చరించింది.
అందులో భాగంగానే నాగార్జున యాదవ్, రవికిరణ్ ఇంటూరి లాంటివాళ్లను అరెస్ట్ చేసి పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, RGV లాంటి వాళ్లకు నోటీసులు ఇవ్వడంతో శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి లు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, లోకేష్, పవన్ లకు సారీ చెప్పారు. అంతేకాదు పోసాని కృష్ణమురళి అయితే సారీ చేప్పి మరీ వైసీపీ పార్టీకి, రాజకీయాలకు గుడ్ బై చెప్పేసారు.
ఇక శ్రీ రెడ్డి అరెస్ట్ పై వార్తలు ఉన్న నేపథ్యంలో ఆమె ముందస్తు బెయిల్ కోసం అప్లై చెయ్యగా, రీసెంట్ గానే శ్రీ రెడ్డి కి ముందస్తు బెయిల్ వచ్చింది. దానితో ఆమె అరెస్ట్ ఆగింది. రాజకీయాల నుంచి తప్పుకున్న పోసానిని కూటమి ప్రభుత్వం గత రాత్రి అరెస్ట్ చేసింది. బాబు, పవన్, లోకేష్ లపై పోసాని చేసిన కామెంట్స్ ఫలితం ఈరోజు ఆయన జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు.
నోరు మంచిదైతే ఊరుమంచిదవుతుంది, జగన్ అండతో రెచ్చిపోయి నేడు జైలుకెళ్లారు అంటూ పోసాని అరెస్ట్ పై నెటిజెన్స్ స్పందిస్తున్నారు.