నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై అభిమానులు ఎంత ఆతృతగా ఉన్నారో మోక్షు డెబ్యూ మూవీ అంతగా వెనక్కి వెళుతుంది. గత ఏడాది గ్రాండ్ గా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ని అనౌన్స్ చేసిన బాలయ్య ఆ సినిమాని పట్టాలెక్కించేందుకు కిందా మీదా పడుతున్నారు. ప్రశాంత్ వర్మను ఏరికోరి మోక్షజ్ఞ డెబ్యూ చిత్రానికి తెచ్చుకున్న బాలయ్య ఇప్పుడు ఆ విషయంలో వెనకడుగు వేశారు.
ప్రశాంత్ వర్మ దర్శకుడిగా మోక్షజ్ఞ మూవీ అనౌన్సమెంట్ వచ్చి ఆరు నెలలు అవుతుంది. కానీ ఈ చిత్రం పట్టాలెక్కకముందే ఆగిపోయింది. దానితో ప్రశాంత్ వర్మ తన పాన్ ఇండియా ప్రాజెక్ట్ జై హనుమాన్ తో పాటుగా ప్రభాస్ తో మరో చిత్రానికి కమిట్ అయ్యాడు. మోక్షజ్ఞ ని హీరోగా పరిచయం చేసే బాధ్యతల నుంచి ప్రశాంత్ వర్మ అఫీషియల్ గా తప్పుకున్నట్లే అంటున్నారు.
జై హనుమాన్ తో పాటు గా ప్రశాంత్ వర్మ ప్రభాస్ ప్రాజెక్ట్ పైకి వెళ్ళిపోతున్నాడు, మోక్షజ్ఞ ప్రాజెక్ట్ కు బదులుగా నిర్మాత సుధాకర్ చెరుకూరి కి గోపీచంద్ మలినేని-బాలకృష్ణ కాంబో ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మోక్షజ్ఞ డెబ్యూ మొదలు కాకముందే ఆగిపోవడంపై నందమూరి అభిమానులు చాలా డిజప్పాయింట్ అవుతున్నారు.