ఈరోజు ఫిబ్రవరి 26 మహా శివరాత్రి. మరి మహాశివరాత్రి అంటే తెలుగు వాళ్లకు పెద్ద పండగ. అందుకే టాలీవుడ్ జనాలు మహాశివరాత్రి రోజున పొలోమని సినిమా అప్ డేట్స్ వదులుతూ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తారు. గత ఏడాది ఇదే రోజున బాలయ్య NBK 109 డాకు మహారాజ్ లాంటి క్రేజీ సినిమాల గ్లిమ్ప్స్ వదిలారు.
కానీ ఈ మహాశివత్రి మాత్రం చాలా డల్ గా ఆరంభమైంది. వచ్చే ఆరు నెలల వరకు పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఆ స్టార్ హీరోల సినిమాల అప్ డేట్స్ కానీ, పోస్టర్స్ కానీ, టీజర్స్ కానీ మహాశివరాత్రికి వదల్లేదు. మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా ఈ సమ్మర్ లో వచ్చేందుకు సిద్ధంగా లేవు. సో వాళ్ళు శివరాత్రిని లైట్ తీసుకున్నారు.
దానితో మహాశివరాత్రి రోజున క్రేజీ అప్ డేట్స్ లేక బోరింగ్ గా స్టార్ట్ అయ్యింది. సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ మజాకా నేడు ఆడియన్స్ ముందుకు రాగా.. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక మహాశివరాత్రి కి స్పెషల్ పోస్టర్స్ అంటూ హంగామా లేకుండానే శివరాత్రి ముగియబోతుంది. స్టార్ హీరోలు, మిడియం హీరోలంతా కామ్ గా శివరాత్రి పర్వదినాన్ని ముగించేస్తున్నారు.