జగన్ మోహన్ రెడ్డి పెంచి పోషించిన బ్లూ మీడియానే జగన్ కు ఇప్పుడు గడ్డిపెడుతున్నారు. జగన్ నమ్ముకున్న ఐప్యాక్ ను పక్కన పడేస్తేనే వైసీపీ పార్టీ బాగుపడుతుంది అంటూ జగన్ కు హితవు బోధిస్తున్నారు. ఐప్యాక్ ను నమ్ముకుని జగన్ నట్టేట మునిగాడు, ఐప్యాక్ తల ఆడించమంటే ఆడించడం, నించోమంటే నించోవడం తప్ప జగన్ కి ఓన్ ఆలోచనలు లేవు అంటూ పదే పదే జగన్ ను బ్లూ మీడియా హెచ్చరిస్తుంది.
మొన్నటికి మొన్న వంశీని పరామర్శించడానికి వెళ్లిన జగన్ కోసం ఓ పాప ఏడుస్తూ రావడం, ఆ పాప తల నిమురుతూ జగన్ సెల్ఫీ దిగడం, ఈ విషయం పై ఎదుటి పార్టీ వారు రచ్చ చెయ్యడం, జగన్ పై, వైసీపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలొ రచ్ఛ చెయ్యడం చూసి బ్లూ మీడియా జగన్ కే అక్షింతలు వేసింది.
ఇక తాజాగా జగన్ షేక్ హ్యాండ్ కోసం ఉదయం నుండి కాళ్లకు చెప్పులు లేకుండా ఓ పిల్లవాడు పడిగాపులు కాయడం, జగన్ అతని దగ్గరకు వెళ్లి ఓదార్చడం ఇవన్నీ ఐప్యాక్ చెబితే జగన్ చేస్తున్నారు తప్ప సొంత ఆలోచనే లేదు, అసలు ఇంత చిన్న వయసులో ఇవన్ని అవసరమా..? స్కూల్‌కు వెళ్లమని చెప్పకుండా పిల్లలకు ఇలాంటివి నాయకులు(జగన్) ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్? అంటూ బ్లూ మీడియానే జగన్ కు గడ్డి పెడుతుంది.