గత వారం విడుదలైన చిత్రాల్లో డబ్బింగ్ చిత్రాల్లో డ్రాగన్, జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రాలు ఆడియన్స్ ను కాస్త ఇంప్రెస్స్ చేసినా బాపు, రామం రాఘవం చిత్రాలు మాత్రం డిజప్పాయింట్ చేసాయి. ఇక ఈవారం మహాశివరాత్రి సందర్భంగా విడుదలకాబోతున్న చిత్రాల్లోకి వెళితే.. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ వారం కూడా పలు సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.
ఈ వారం తెలుగు నుంచి ఒకటే సినిమా రిలీజ్ అవుతుండగా.. మరో రెండు డబ్బింగ్ సినిమాలు బాక్సాఫీసు బరిలోకి రానున్నాయి. అందులో యంగ్ హీరో సందీప్‌కిషన్-దర్శకుడు త్రినాథరావు కాంబో మూవీ మజాకా, శబ్ధం, అగాథియా, తకిట తదిమి తందనా.. చిత్రాలు థియేటర్స్ లో విడుదలవుతున్నాయి.
ఇక ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్:
డబ్బా కార్టెల్ - వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 28
అమెజాన్ ప్రైమ్:
సుడల్2 - వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 28
జిద్దీ గర్ల్స్ - వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 27
హౌస్ ఆఫ్ డేవిడ్ - వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 27
సూపర్ బాయ్స్ ఆప్ మాలేగావ్ - సినిమా - ఫిబ్రవరి 28
జియో హాట్‌స్టార్:
లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ - మలయాళం - సినిమా - ఫిబ్రవరి 28
బీటిల్ జ్యూస్ - సినిమా - ఇంగ్లీష్ - ఫిబ్రవరి 28
ది వాస్ప్ - సినిమా - ఇంగ్లీష్ - ఫిబ్రవరి 28
సూట్స్ - వెబ్ సిరీస్- ఫిబ్రవరి 24
ఎంఎక్స్ ప్లేయర్:
ఆశ్రమ్ 3 - హిందీ - వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 27