ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో జపాన్ లోను అభిమానులను సంపాదిచుకున్న మన భీమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ అభిమానాన్ని వాడేందుకు రెడీ అయ్యాడు. జపాన్ లో తారక్ కు ఎంతగా అభిమానులున్నారో ఆయన జపాన్ వెళ్ళినప్పుడు చూశారు. అక్కడి ప్రేక్షకులు ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ కోసమే కాదు, ఆర్.ఆర్.ఆర్ ని థియేటర్స్ లో వీక్షించి హిట్ చేసారు.
అందుకే ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం దేవర ను జపాన్ లో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవడమే కాదు, దేవర జపాన్ రిలీజ్ కు సంబంధించి ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. దేవర చిత్రాన్ని జపాన్ లో విడుదల చేసేందుకు కసరత్తులు మొదలు పెట్టారు.
మరి జపాన్ అభిమానం దేవర కు ఎంతగా వర్కౌట్ అవుతుంది, ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం దేవర చిత్రంపై జపాన్ ప్రేక్షకులు ఎంత చూపిస్తారో జస్ట్ వెయిట్ అండ్ సి.