ధమాకా డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలోసందీప్ కిషన్-రీతూ వర్మ జంటగా తెరకెక్కిన మజాకా మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మహా శివరాత్రి స్పెషల్ గా రేపు విడుదల కాబోతున్న మజాకా పెయిడ్ ప్రీమియర్స్ హంగామా ఈరోజు సాయంత్రం నుంచి మొదలు కాబోతుంది.
సందీప్ కిషన్ డౌన్ ఫాల్ లో ఉన్న హీరో, ఆయన సినిమాలకు కొన్నాళ్లుగా ఆడియన్స్ లో మినిమమ్ బజ్ కూడా కనిపించడం లేదు. రీతూ వర్మ వరస సినిమాలు చేస్తున్నా ఆమెకు టాలీవుడ్ లో సరైన బ్రేక్ దొరకడం లేదు, ఇక రావు రమేష్ కేరెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ హైప్ లో ఉన్న నటుడు. నిన్నటివరకు మజాకా పై బజ్ లేకపోయినా తాజాగా వదిలిన మజాకా ట్రైలర్ మాత్రం సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది.
ట్రైలర్ చూసాక కామెడీ ఎంటర్టైనర్ గా మజాకా ఉండబోతుంది అనేది స్పష్టమవుతుంది. ఇప్పుడు ఈ సినిమా భారమంతా దర్శకుడు త్రినాధ్ రావు నక్కినపైన ఉంది. ధమాకా హిట్టు తర్వాత త్రినాధ్ రావు నుంచి రాబోతున్న మజాకా పై ఆసక్తి క్రియేట్ అయ్యింది అంటే అది దర్శకుడి వల్లే అంటున్నారు. మరి ఆ హోప్స్ తోనే ప్రేక్షకులు థియేటర్స్ కి కదిలితే మజాకా కు హెల్ప్ అవుతుంది. చూద్దాం మజాకా భవితవ్యమేమిటో మరికాసేపట్లో తేలిపోతుంది.