అజిత్-త్రిష ల లేటెస్ట్ చిత్రం పట్టుదల ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఫిబ్రవరి 6 న పాన్ ఇండియా మూవీగా విడుదలైన విడమయుర్చి చిత్రం కోలీవుడ్ లో తప్ప మిగతా భాషలన్నిటిలో డిజప్పాయింట్ చేసింది.
థియేటర్స్ లో ఫిబ్రవరి 6 న విడుదలైన ఈచిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది. ప్రస్తుతం థియేట్రికల్ రన్ ముగియడంట్ పట్టుదల నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. థియేటర్స్ లో విడుదలై నెల తిరక్కుండానే అంటే మూడు వారాలకే పట్టుదల ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది.
తాజాగా నెట్ ఫ్లిక్స్ నుంచి విడమాయుర్చి/పట్టుదల చిత్రం మార్చ్ 3 నుంచి స్ట్రీమింగ్ లోకి తేబోతున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. మరి థియేటర్స్ లో మిస్ అయిన పట్టుదలను ఓటీటీలో చూసేందుకు అజిత్ ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ రెడీ అవ్వాల్సిందే.