ఈమధ్యన మంచు ఫ్యామిలీ ఆస్తి వ్యవహారము, మంచు మనోజ్ చేస్తున్న కామెంట్స్ అన్ని మీడియాలో ఎంతగా పాపులర్ అయ్యాయో, కామన్ పీపుల్ లోను మంచు ఫ్యామిలీ రచ్చ అంతే హైలెట్ అయ్యింది. ఇప్పటికి మంచు మనోజ్ మోహన్ బాబు, మంచు విష్ణు లపై సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంచు విష్ణు కన్నప్ప ప్రమోషన్స్ లో పాల్గొంటూ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్నాడు. తాజాగా మంచు విష్ణు మంచు ఫ్యామిలీ వివాదం పై రియాక్ట్ అయ్యాడు. తనకు ఉమ్మడి కుటుంబం అంటేనే ఇష్టం, ఎప్పుడు అమ్మానాన్నలతో కలిసి ఉండాలానుకుంటానని, తన పిల్లలు కూడా అలాంటి వాతావరణంలోనే పెరగాలని కోరుకుంటానని తెలిపాడు.
ఇప్పటికైనా తమ కుటుంబంలోని గొడవలకు ఫుల్ స్టాప్ పడితే బాగుంటుందని చెప్పిన మంచు విష్ణు తనకు శివుడు ప్రత్యక్షమై వరమిస్తానంటే, తాను మాత్రం ఎన్ని జన్మలకైనా తనకు తండ్రిగా మోహన్ బాబే కావాలని కోరుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు.