బుట్టబొమ్మ పూజ హెగ్డే ప్రస్తుతం తమిళ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. కొన్నాళ్లుగా చేతిలో సినిమాలు లేని పూజ హెగ్డే కి సడన్ గా తమిళ్ నుంచి అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. సూర్య, విజయ్, రాఘవ లారెన్స్ సినిమాలు మాత్రమే కాదు రజినీకాంత్ కూలీ లో పూజ హెగ్డే కి స్పెషల్ సాంగ్ అఫర్ ఇచ్చాడు లోకేష్ కనగరాజ్.
అందుకే అమ్మడు బిజీ అయ్యింది. అటు హిందీలోనూ కమిట్మెంట్స్ ఉన్న పూజ హెగ్డే కు రీసెంట్ గా షాహిద్ కపూర్ దేవా షాకిచ్చింది. జనవరి లో విడుదలైన దేవా రిజల్ట్ పూజ హెగ్డే ను ఇబ్బంది పెట్టింది. అయినా తమిళ అవకాశాలు ఆమెకు బిగ్ రిలీఫ్ నిచ్చాయనే చెప్పాలి.
ఇక సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ట్రెండీ ఫోటో షూట్స్ తో హడావిడి చేస్తున్న పూజ హెగ్డే తాజాగా వదిలిన పిక్ చూసి వావ్ బుట్టబొమ్మ గ్లామర్ గా ఎంత బావుంది అంటూ ఓపెన్ కామెంట్స్ చేస్తున్నారు యూత్. స్లీవ్ లెస్ టాప్ లో లూజ్ హెయిర్ తో అప్పుడే నిద్రలేచింది అన్నట్టుగా ఉంది పూజ హెగ్డే న్యూ లుక్.