ఎట్టకేలకు జగన్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం తమకు ప్రతి పక్ష హోదా ఇవ్వడం లేదు, మాకు ప్రతిపక్ష హోదా వచ్చేవరకు అసెంబ్లీ లో అడుగుపెట్టమని చెప్పిన జగన్ 60 రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ కి హాజరవ్వకపోతే అనర్హత వేటు పడుతుంది అనే భయం నేడు మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు జగన్ బెంగుళూరు నుంచి తాడేపల్లి వచ్చారు.
మొదటిరోజు అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ సభ్యులు సభలో రసాభాస చేస్తూ ప్రతిపక్ష హోదా కావాలని పట్టుబట్టారు, ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అనే కారణంగా వాకౌట్ చేసారు. జగన్ అండ్ కో అసెంబ్లీ నుంచి వాకౌట్ చెయ్యడం పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు.
ప్రజలు వైసీపీకి 11 సీట్లే ఇచ్చారు. వైసీపీ కి 11 సీట్లు వచ్చినా స్పీకర్ ఇన్ని రోజులుగా వాళ్లకు సరైన గౌరవం ఇచ్చారు, ప్రజలు ఇచ్చిన 11 సీట్లను గౌరవించి అసెంబ్లీకి రండి, వచ్చే ఐదేళ్ల వరకు వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదు, కనీసం జనసేన కన్నా ఒక్క సీటు ఎక్కువ వచ్చినా వైసీపీ కి ప్రతి పక్ష హోదా దక్కేది. ఇప్పుడు అసెంబ్లీలో జనసేన అతిపెద్ద రెండో పార్టీ.
11 సీట్లు ఉన్నవారికి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు నినాదాలు చేయడం, అరుపులు, కేకలు కరెక్ట్ కాదు, ఇదో లో లెవల్ విధానం అని, వైసీపీ నేతలు ఇంకా ఎదగాలి, వైసీపీ నాయకులు హుందాగా వ్యవహరించాల్సిన అవసరం, బాధ్యత ఉంది అంటూ పవన్ కళ్యాణ్ మీడియా ముందు వైసీపీ రచ్చపై తీవ్ర విమర్శలు చేశారు.