యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీ ని మీడియాకి అంతగా ఫోకస్ అవ్వనివ్వరు. చాలా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తారు. ఎప్పుడైనా ఎయిర్ పోర్ట్ లో భార్య పిల్లలతో కలిసి కనిపించడం తప్ప బయట కనిపించరు. ఇక మహేష్ వైఫ్ నమ్రత గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. పార్టీ అయినా, ఫ్యామిలీ ఫంక్షన్ అయినా, లేదంటే ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడమైనా ఏదైనా ఆమె తన సోషల్ మీడియా ఖాతా నుంచి అందరికి షేర్ చేస్తుంది.
తాజాగా టాలీవుడ్ స్టార్స్ దుబాయ్ లోని ఓ పెళ్ళిలో ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడు చరణ్ భార్య ఉపాసన, మహేశ్ భార్య నమ్రతలు కలిసి కనిపించేవారు కానీ తాజాగా ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి-మహేష్ భార్య నమ్రత కలిసి మోడ్రెన్ లుక్ లో కనిపించడం, ఆ పిక్ ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది.
దుబాయ్ లో ఓ సెలెబ్రిటీ ఇంట జరిగిన పెళ్ళిలో స్టార్స్ వారి వారి భార్యలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న విషయం ఇలాంటి పిక్స్ ద్వారా బయటికొస్తున్నాయి. ప్రస్తుతం నమ్రత-ప్రణతి పిక్ మాత్రం తెగ వైరల్ అవుతుంది.