కొద్దిరోజులుగా సౌత్ ని పట్టించుకోకుండా, హిందీ వెబ్ సిరీస్ లను చూజ్ చేసుకుంటున్న సమంత ఎప్పుడెప్పుడు సౌత్ కి రీ ఎంట్రీ ఇస్తుందా అనే ఆత్రుత ఆమె అభిమానుల్లో కనిపిస్తుంది. అటు సమంత మాత్రం అదేమీ పట్టనట్టుగా ముంబై లోనే మకాం వేసింది. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసింది.
అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత సరదాగా సమాధానలిచ్చింది. తాను నెగిటివిటీని ఎదుర్కొనేందుకు మెడిటేషన్ లాంటి రోటీన్ ఫార్ములానే ఫాలో అవుతానని చెప్పిన సమంత తనకు నచ్చిన హీరోయిన్స్ గురించి అడిగితే.. అమరన్ లో సాయి పల్లవి, పార్వతి తిరువోతు, సూక్ష్మ దర్శిని లో నజ్రియా, జిగ్రా లో అలియా భట్, అనన్య పాండే వీరంతా రాక్ స్టర్స్ అంటూ చెప్పిన సమంత ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే వీడియో చేస్తాను అంటూ నవ్వేసింది.
మీరు తిరిగొచ్చెయ్యండి బ్రో, మిమ్మల్ని ఎవరు ఆపలేరు అన్న అభిమానితో తిరిగొస్తాను బ్రో అంటూ సరదాగా సమాధానమిచ్చింది.