ఇండియా - పాకిస్తాన్ వీరి మద్యన ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ జరిగినా ఇరు దేశాల క్రికెట్ అభిమానులే కాదు, కామన్ ఆడియన్స్ కూడా ఏంతో ఉత్సుకతతో చూస్తారు. నేడు దుబాయ్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కోసం టాలీవుడ్ స్టార్స్, సెలెబ్రిటీస్ క్యూ కట్టారు. ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ గ్యాలరీలు ఆడియన్స్ తో కిక్కిరిసిపోయాయి.
చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ 2025లో ఈరోజు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ జరగగా.. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ పైన భారత్ 242 పరుగులతో సునాయాస విజయం సాధించింది. విమర్శకులకు బ్యాట్ తో సమాధానమిచ్చాడు విరాట్ కోహ్లీ. బ్యాటింగ్లో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీ 111 బంతుల్లో సెంచరీ సాధించాడు.
హాఫ్ సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ పాకిస్తాన్ పై రెచ్చిపోయాడు. ఆరు వికెట్ల తేడాతో ఇండియా గెలుపు. ఈ గెలుపుతో ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ కి కళ్లెం వేసింది ఇండియా. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఈ ఓటమితో పాకిస్తాన్ వైదొలిగింది.