నాగ చైతన్య-చందు మొండేటిల లేటెస్ట్ చిత్రం తండేల్ ఫిబ్రవరి 7 న పాన్ ఇండియా మర్కెట్ లో రిలీజ్ అయ్యింది. తండేల్ రిలీజ్ రోజు ఈ చిత్రానికి హిట్ టాక్ స్ప్రెడ్ అవడమే కాదు సినీ విమర్శకులు కూడా తండేల్ కి పాస్ మార్కులు వేశారు. నాగ చైతన్య పెరఫార్మెన్స్, సాయి పల్లవి నటన, దేవిశ్రీ మ్యూజిక్ ఇవన్నీ తండేల్ కి బలంగా నిలిచాయి.
తండేల్ విడుదలైన రెండో వారంలో విడుదలైన చిత్రలేవీ ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేయలేకపోవడంతో మరో వారం తండేల్ దే అవడము, 100 కోట్ల పోస్టర్ వేసి మేకర్స్ ప్రకటించడము జరిగింది. అయితే తండేల్ టాక్ కి కలెక్షన్స్ కి సంబంధం లేదు. హిట్ టాక్ వచ్చినా తండేల్ కి తగిన కలెక్షన్స్ రాలేదు అంటున్నారు. కారణం తండేల్ కి పైరసీ దెబ్బేసింది.
తండేల్ విడుదలైన రెండోరోజే ఏపిఎస్ ఆర్టీసీ బస్సుతో తండేల్ సినిమా వెయ్యడం ,ప్రేక్షకులు పైరసీ వీక్షించడంతోనే ఈ చిత్రానికి అనుకున్న కలెక్షన్స్ రాలేదు అంటున్నారు. తండేల్ మూడో వారంలోకి ఎంటర్ అయ్యింది. ఈ వారం సినిమాలేవీ ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేయలేకపోయాయి. కానీ వాటితో పాటే తండేల్ హడావిడీ కనిపించడం లేదు.
100 కొట్ల పోస్టర్ వేసాక మేకర్స్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. అటు చైతు నెక్స్ట్ సినిమా కోసం ప్రిపేరవుతుంటే సాయి పల్లవి హిందీ రామాయణ షూట్ కి వెళ్ళిపోయింది. దానితో తండేల్ సందడి కనిపించలేదు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.