ఏపీ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ తన నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండడమే కాదు, ప్రజల సమస్యలు విని సత్వర పరిష్కార మార్గం సూచిస్తూ.. ప్రజాదర్బార్ నడిపిస్తున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ ప్రజలు సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని లోకేశ్ హామీ ఇస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. అటు విద్యాశాఖలోనూ నూతన సంస్కరణలతో బిజీగా ఉంటున్న మినిస్టర్ నారా లోకేష్ తాజాగా దుబాయ్ లో తేలారు.
దుబాయ్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను తిలకిస్తూ లోకేష్ సందడి చేసారు. భారత జెర్సీలో కుమారుడు దేవాన్ష్ తో కలిసి మ్యాచ్ ను వీక్షిస్తున్న నారా లోకేష్ ఫొటోస్ సోషల్ మీడియా వైరల్ కాగా.. అవి చూసిన నెటిజెన్స్ మంత్రి నారా లోకేష్ ఆటవిడుపు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మంత్రి లోకేష్ తో కలిసి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మినిస్టర్ హోదాలో ఐసీసీ చైర్మన్ జై షాతో సమావేశమై, రాష్ట్రంలో క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించారు. అదే మ్యాచ్‌కు రాజ్యసభ ఎంపీ సానా సతీష్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా హాజరయ్యారు.