కోలీవుడ్ నటి అంజలి తనకి కెరీర్ లో బ్రేకిచ్చే అవకాశం కోసం టాలీవుడ్ నుంచి తమిల్ సినిమాల వరకు ఎదురు చూస్తుంది. తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి లాంటి చిత్రాలు ఉన్నా, తమిళనాట పేరున్న హీరోలతో నటించినా అమ్మకుడుకి బ్రేక్ ఇచ్చే మూవీ మాత్రం పడడం లేదు. అంజలి లేటెస్ట్ గా నటించిన పాన్ ఇండియా ఫిలిం గేమ్ చేంజర్ కూడా ఆమెకు బిగ్ షాకిచ్చింది.
ఒకప్పుడు ట్రెడిషన్ కి మారు పేరుగా ఉన్న అంజలి కొన్నాళ్లుగా గ్లామర్ అవతారమెత్తింది. సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో గ్లామర్ బాట పట్టింది. తరచూ కాకపోయినా అప్పుడప్పుడు గ్లామర్ ఫొటోస్ తో అవకాశాల కోసం వల విసురుతుంది. తాజాగా అంజలి బ్లాక్ డ్రెస్ లో ఇచ్చిన కిర్రాక్ ఫోజులకు యూత్ గుండెజారిపోతుంది.
క్యాచ్ ది వైబ్ అంటూ అంజలి షేర్ చేసిన గ్లామర్ పిక్స్ చూసి అంజలి బ్లాస్టింగ్ లుక్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ మనోగ్న గోల్లపూడి ఈ లుక్‌కు స్టైలింగ్ చేయగా, ఆహిలా ఖాన్ డిజైన్ చేసిన అవుట్‌ఫిట్‌లో అంజలి అదిరిపోయే ఫోటోలకు ఫోజులిచ్చింది.