రాజ్ తరుణ్-లావణ్య కేసు విషయంలో మధ్యలో ఎంటర్ అయిన మస్తాన్ సాయి పేరు ఇప్పుడు సెన్సేషన్ అయ్యింది. లావణ్య పెట్టిన కేసుతో మస్తాన్ సాయి జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చెయ్యడమేకాదు, డ్రగ్స్ తీసుకున్న కేసులో మస్తాన్ సాయి ని అరెస్ట్ చేసారు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న మస్తాన్ సాయి విచారణలో ఇప్పటికే పోలీసులు విస్తుపోయే నిజాలను తెలుసుకుంటున్నారు. వెలుగులోకి వస్తున్న మస్తాన్ సాయి అరాచకాలు అన్ని ఇన్ని కావు.
మూడు రోజుల కస్టడీ రిమాండ్ లో మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో మొత్తం 17 ఫోల్డర్లను పోలీసులు గుర్తించారు. హార్డ్ డిస్క్ ఫోల్డర్స్ ను పోలీసులు మస్తాన్ సాయి ముందే తెరిచారు. వాటిలో 505 వీడియోలుండగా, అందులో సగానికిపైగా నగ్నంగా ఉన్న యువతులవే కావడం పోలీసులకు దిమ్మతిరిగేలా చేసింది.
అంతేకాకుండా అందులో ఆరుగురు యువతుల వీడియో కాల్స్ కూడా ఉన్నాయి. ఆ బయట పడిన వీడియోస్ లో మస్తాన్ సాయి భార్య వీడియోస్ కూడా ఉండడం మరింత షాకిచ్చే అంశం. యువతులతో తన గదిలో ప్రైవేటుగా ఉన్న సమయంలో రహస్యంగా చిత్రీకరించిన వీడియోలు, ఫొటోలు ఉన్నాయి. లావణ్య, ఆమె స్నేహితురాళ్లను కూడా మస్తాన్ సాయి లోబరుచుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు.
దాదాపుగా మూడేళ్లుగా రహస్యంగా మస్తాన్ సాయి ఈ వీడియోస్ ని రహస్యంగా సేకరిస్తున్నట్లుగా పోలీసులు కనిపెట్టారు. మొత్తం 2,500కు పైగా ఫోటోలు, 734 ఆడియో రికార్డింగ్స్‌ను పోలీసులు గుర్తించారు. ఇది చూసిన నెటిజెన్స్ అమ్మో మస్తాన్ సాయి ఇన్ని అరాచకాలు చేశాడా అంటూ షాకవుతున్నారు.