అలియా భట్ ని బాలీవుడ్ యువరాణి ఎందుకు అంటారో అనేది ఇలాంటి పిక్స్ చూస్తే అర్ధమవుతుంది. క్యూట్ గా స్వీట్ గా ఉన్న అలియా భట్ పై లుక్ చూస్తే నిజంగా యువరాణినే అని పిలవాలి. పింక్ శారీ లో అలియా భట్ బ్యూటిఫుల్ గా కాదు దేవతలా కనిపించింది. సింప్లి సూపర్బ్ గా అలియా భట్ ని చూస్తే అమ్మాయిలు కూడా ఫిదా అవ్వాల్సిందే.
ఆర్.ఆర్.ఆర్ లో సీత గా కనిపించిన అలియా భట్ ను మరోసారి సౌత్ లో చూడాలని ఇక్కడి ఆడియన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ప్రభాస్-హను రాఘవపూడి చిత్రంలో అలియా భట్ ఏదో యువరాణి కేరెక్టర్ లో కనిపించే అవకాశం ఉంది అన్నప్పటికి.. అది జస్ట్ రూమర్ గానే నిలిపోయేలా ఉంది అంటున్నారు.
కారణం బాలీవుడ్ లో అలియా భట్ చాలా బిజీ హీరోయిన్. అలియా భట్ డేట్స్ దొరకాలంటే అంత వీజీ కాదు. మరి ఆ అదృష్టం సౌత్ ఆడియన్స్ కు ఎప్పుడు దక్కుతుందో చూడాలి.