కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ లేటెస్ట్ మూవీ విడమయుర్చి గా తమిళనాట రిలీజ్ అవగా, అదే చిత్రం ఫిబ్రవరి 6 న తెలుగులో పట్టుదలగా విడుదలైంది. కోలీవుడ్ లో అజిత్ చిత్రానికి హిట్ టాక్ వచ్చినా తెలుగులో మాత్రం పట్టుదల ప్రభావం చూపలేకపోయింది. పట్టుదల విడుదలైన రెండో రోజే నాగ చైతన్య తండేల్ విడుదల కావడం దానికి పాజిటివ్ టాక్ రావడంతో తెలుగులో అజిత్ చిత్రానికి పూర్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి.
తమిళనాట పర్వాలేదనిపించిన ఈచిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకుంది. అయితే థియేటర్స్ లో ఫిబ్రవరి 6 న రిలీజ్ న అజిత్ విదమయుర్చి/పట్టుదల ఓటీటీ స్ట్రీమింగ్ పై అజిత్ ఫ్యాన్స్ తో పాటుగా మాస్ ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నారు.
మార్చ్ మొదటివారంలో అజిత్ పట్టుదల నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే మార్చ్ 7 నుంచి అజిత్ విడమయుర్చి నెట్ ఫ్లిక్స్ నుంచి ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు.