Advertisement
Google Ads BL

డాకు మహారాజ్ ట్విస్ట్ ఇవ్వరు కదా


నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ హిట్ చిత్రం డాకు మహారాజ్ మరికాసేపట్లో ప్రముఖ ఓటీటీ  సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ లోకి రాబోతుంది. జనవరి 12 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం కాస్త లేటుగానే అంటే ఐదు వారాల గ్యాప్ తో ఓటీటీలోకి రాబోతుంది. 

Advertisement
CJ Advs

అయితే డాకు మహారాజ్ ఓటీటీ వెర్షన్ పై కొన్ని వార్తలు సొషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. థియేట్రికల్ వెర్షన్ నుంచి డాకు మహారాజ్ ఓటీటీలోకి వచ్చేసరికి కొన్ని సీన్స్ కట్ అయ్యి వస్తుంది అంటూ ప్రచారం జోరుగా జరుగుతుంది. సినిమాలో కీలక పాత్ర పోషించి, దబిడి దిబిడి సాంగ్ లో ఇరగ్గొట్టేసిన ఊర్వశి రౌతేల్ల సీన్స్ ఓటీటీ వెర్షన్ లో కట్ అవుతాయని అంటున్నారు. 

కారణం నెట్ ఫ్లిక్స్ డాకు మహారాజ్ ఓటీటీ డేట్ కు సంబంధించి ఆ సమయంలో అనగనగా ఒక రోజు.. అంటూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. కానీ అందులో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేల్ల మిస్ అయింది. దానితో ఆమెకి సంబందించిన సీన్స్ ఓటీటీలోకొచ్చేసరికి ఉండవు అంటూ ప్రచారం జరిగింది. ఆ ప్రచారం తో చాలామంది డిజప్పాయింట్ అయ్యారు.  

కానీ తర్వాత వదిలిన స్లైడ్ షో లో ఊర్వశి పిక్స్ రెండుసార్లు స్క్రోల్ అవడంతో డాకు మహారాజ్ థియేట్రికల్ వెర్షన్ నే నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుందని అర్ధమవుతుంది. 

Daaku Maharaj streaming on Netflix:

Did Netflix delete Urvashi Rautela scenes from Daaku Maharaj
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs