Advertisement
Google Ads BL

రజినీతో పూజ హెగ్డే స్టెప్స్


తాజాగా పూజా హెగ్డే పేరు పెద్దగా వినిపించడం లేదు. సినీ పరిశ్రమలో కొత్త నటీమణుల రాకతో ఆమెకు అవకాశాలు తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఆమెకు ఒక బిగ్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కొత్త సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో ఆమె కనిపించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement
CJ Advs

రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న కూలీ సినిమాలో తెలుగు స్టార్ నాగార్జున కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రత్యేకంగా రూపొందించిన ఒక పాటకు పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చిత్రబృందం ఇటీవల ఆమెతో సంప్రదింపులు జరిపిందని పూజా కూడా ఈ పాటలో నర్తించేందుకు అంగీకరించినట్లు సమాచారం.

పూజా హెగ్డేకు స్పెషల్ సాంగ్స్ చేయడం కొత్తేమీ కాదు. ఇంతకు ముందు రంగస్థలం, ఎఫ్ 3 చిత్రాల్లో కూడా ఆమె ప్రత్యేక గీతాల్లో ఆకట్టుకున్నారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మాత్రం ఆమెకు ఇదే మొదటిసారి. పైగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ పాట ఆమెకు మరింత గుర్తింపు తెచ్చే అవకాశం ఉంది.

ఈ చిత్రంలో ఉపేంద్ర, శృతి హాసన్ కూడా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. వచ్చే ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పూజా హెగ్డే మరో పక్క లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న కాంచన 4 లోనూ నటిస్తోంది. అంతేకాకుండా ఆమె ఒక హిందీ చిత్రంలో నటిస్తుండగా సూర్య నటిస్తున్న రెట్రో సినిమాలో కూడా కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమా ఆమె కెరీర్‌లో కొత్త మలుపుగా మారుతుందా లేదా అనేది చూడాలి.

Is Pooja Hegde Set To Join Rajinikanth :

Is Pooja Hegde Set To Join Rajinikanth In Coolie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs