కేశినేని నానిబీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నాడా, వైసీపీ నుంచి నాని బీజేపీ లోకి జంప్ అవనున్నాడా అంటే అవుననే సమాధానమే వస్తోంది. కొంతకాలంగా టీడీపీ పై గుర్రున ఉన్న కేశినేని నాని 2024 ఎన్నికల ముందు వైసీపీ లోకి మాపోయాడు. చంద్రబాబు పై అవాకులు చవాకులు పేలిన నాని ఆతర్వాత జగన్ ని మంచోడు అన్నాడు. కానీ కేశినేని నానికి వైసీపీ లో ఎలాంటి గౌరవం దక్కలేదు. దానితో రాజకీయాలకు దూరం జరిగాడు.
కానీ ఇప్పడు బీజేపీ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నాడు, బీజేపీ నేత పురందరేశ్వరి తో కేశినేని నాని రహస్యమంతనాలు ఇపుడు మీడియాలో హైలెట్ అయ్యాయి. కేశినేని అనుచరులు కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఎటు కాకుండా పోయారు. వారి బిజినెస్ లు సైతం మరుగున పడే పరిస్థితిలో కేశినేని పై వారి ఒత్తిడి ఎక్కువడడంతో కేశినేని నాని కూడా బీజేపీ తో దోస్తీ కడితే ఫ్యూచర్ బావుంటుంది అని ఆ విధంగా బీజేపీ తో మైత్రి కట్టేందుకు మార్గం వెతుకుంటున్నాడు అంటున్నారు.
ఆందులో భాగంగానే కేశినేని నాని బీజేపీ నేత నితిన్ గడ్కరీని పొగుడుతున్నారు. నితిన్ గడ్కరీని పట్టుకుని బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే కేశినేని నాని బీజేపీ లో చేరి తన రాజకీయ ప్రత్యర్థి కేశినేని చిన్నికి చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారనే మాట వినబడుతుంది. ఓ నెలలోకేసినేని బీజేపీ తీర్ధం పుచ్చుకోవచ్చనే ప్రచారం జరుగుతుంది.