Advertisement
Google Ads BL

మస్తాన్ సాయి విచారణలో నివ్వెరపోయే నిజాలు


 మస్తాన్ సాయికి సంబంధించిన పోలీస్ కస్టడీ ముగియడంతో ఆయనను మళ్లీ చంచల్ గూడ జైలుకు తరలించారు. మూడు రోజుల పాటు కొనసాగిన విచారణలో కీలక వివరాలు బయటకు వచ్చాయి. పోలీసుల ప్రశ్నలకు మస్తాన్ సాయి ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. హార్డ్ డిస్క్‌లో ఉన్న వీడియోలన్నీ తానే చిత్రీకరించానని ఆ కాంటెంట్ ఉద్దేశపూర్వకంగానే తీసినట్లు అంగీకరించాడు.

Advertisement
CJ Advs

మస్తాన్ సాయి తన ఆధ్వర్యంలో ఎన్నో పార్టీలను నిర్వహించానని ఆ పార్టీల్లో యువతిని భాగస్వామ్యం చేయించేందుకు డ్రగ్స్‌కు అలవాటు చేసానని అంగీకరించాడు. మత్తులో ఉన్న అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడి ఆ వీడియోలు తీసి ఆ తర్వాత ఆ వీడియోలతో వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడని తెలిపాడు.

పోలీసులు మస్తాన్ సాయిని ప్రధానంగా డ్రగ్స్ సరఫరా కోణంలో విచారించారు. అతను బెంగళూరు గోవా నుంచి మాదక ద్రవ్యాలను తెప్పించుకున్నట్లు ఒప్పుకున్నాడు. అయితే తన దగ్గర డ్రగ్స్ ఉన్నప్పటికీ అవి వ్యాపారం కోసమేనని ఎవరికీ సరఫరా చేయలేదని చెప్పాడు. తను నిర్వహించే పార్టీల్లోనే వాటిని వినియోగించానని పేర్కొన్నాడు.

పోలీసుల విచారణలో లావణ్యతో తన పరిచయం ఎలా ఏర్పడిందో వివరించిన మస్తాన్ సాయి ఆమెను కూడా డ్రగ్స్‌కు అలవాటు చేసినట్లు అంగీకరించాడు. లావణ్యపై లైంగిక దాడి చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నప్పటికీ అది ఆమె అంగీకారంతోనే జరిగిందని చెప్పాడు.

మస్తాన్ సాయి వ్యవహారం అతడి కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గుంటూరులోని మస్తాన్ దర్గా ధర్మకర్తగా కొనసాగుతున్న అతని తండ్రి రావి రామ్మోహన్ రావును ఆ పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్ ఊపందుకుంది. ప్రముఖ న్యాయవాది నాగూర్ బాబు ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌కు లేఖ రాసి మస్తాన్ సాయి చేసిన పనులు దర్గా ప్రతిష్ఠను దెబ్బతీసాయని భక్తుల భద్రతకు ముప్పుగా మారుతున్నాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో,మస్తాన్ దర్గాను ప్రభుత్వ పరిరక్షణలో లేదా వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించాలని లేఖలో సూచించారు. మస్తాన్ సాయి వ్యవహారం ఆయన కుటుంబానికి మాత్రమే కాకుండా దర్గా పరిపాలనపై కూడా ప్రభావం చూపేలా ఉంది.

Shocking facts from the Mastan Sai trial:

Shocking Facts In Mastan Sai Case
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs