అక్కినేని యువ హీరోలు, అక్కినేని బ్రదర్స్ నిన్న CCL మ్యాచ్ లో సందడి చేసారు. ఆల్రెడీ అఖిల్ సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ లో టాప్ 1 ప్లేయర్. ప్రస్తుతం సెలెబ్రిటీ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. తండేల్ తో బిగ్ హిట్ కొట్టిన నాగ చైతన్య తన తండేల్ టీమ్ తో నిన్న జరిగిన CCL మ్యాచ్ గ్రౌండ్ లో తమ్ముడు అఖిల్ తో కలిసి సందడి చేసాడు. .
గ్రౌడ్ లో అన్నదమ్ములు నాగ చైతన్య-అఖిల్ ఇద్దరూ కలిసి సరదాగా స్పెండ్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలా రోజుల తర్వాత వచ్చిన తండేల్ విజయాన్ని తనివితీరా అనుభవిస్తూ నాగ చైతన్య ను, క్రికెట్ మ్యాచ్ లో హుషారుగా కనిపించిన అఖిల్ ని చూసి అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
అఖిల్ ఏజెంట్ మూవీ తరువాత వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడితో మూవీని మొదలు పెట్టాడు అని వార్తలొచ్చినా అధికారిక అప్ డేట్ అయితే లేదు, ఇక మార్చ్ లో అఖిల్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. మార్చ్ 24 న అఖిల్-జైనబ్ ల వివాహం జరగబోతున్నట్టుగా తెలుస్తుంది.